Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి కూలీలకు కాసుల జల్లు కురిపిస్తోంది. సాధారణంగా పని కోసం అడ్డాల్లో ఎదురుచూసే దినసరి కూలీలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచార బృందాల్లో బిజీగా ఉన్నారు. ఉదయం ఎనిమిదింటికే కృష్ణానగర్, బోరబండ, (Borabanda) రహ్మత్‌నగర్, శ్రీనగర్ కాలనీల్లో ఖాళీగా కనిపించే కూలీ అడ్డాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే, ఉపఎన్నికల హడావిడిలో పార్టీలు వీరిని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు తీసుకెళ్తున్నాయి. ప్రతి డివిజన్‌లో అభ్యర్థులు, కీలక నేతల వెంట కనీసం వందమంది ఉండేలా పార్టీలు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
Read also: TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూలీలకు,విద్యార్థులకు కాసుల వర్షం!
Jubilee Hills: ప్రచార పనుల్లో పాల్గొనే కూలీలకు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నారు. అదనంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. కొన్ని పార్టీలు మరింత ఆకర్షణీయంగా రూ.800 వరకు చెల్లిస్తున్నాయని సమాచారం. దీంతో స్థానిక కూలీలే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు కూడా ప్రచారంలో భాగమవుతున్నారు. ఇదే సమయంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులను ఓటర్ల సర్వే పనిలో వినియోగిస్తున్నారు. బూత్ వారీగా ఓటర్ల జాబితాలను అందించి ఇంటింటికీ సర్వే చేయిస్తున్నారు. ఓటర్లు తమ చిరునామాలో ఉన్నారా లేదా తెలుసుకొని వారి ఫోన్ నంబర్లను సేకరించడం వీరి పని. ఈ పనికి విద్యార్థులకు రోజుకు రూ.1000 వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. సేకరించిన డేటా ఆధారంగా పార్టీలు ఐవీఆర్‌ఎస్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, టెలీకాల్స్ ద్వారా ఓటర్లను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: