Jeevan Rao: ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

Read Time:  1 min
Jeevan Rao
Jeevan Rao
FONT SIZE
GET APP

ఏడాదిలోగా మీ నమ్మకానికి దగ్గట్టు…
మీ ఆలోచనలకు దగ్గట్టు పనిచేయకున్నా…
మీ అందరి కోరిక మేరకు నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా

  • న్యాయవాది, బిఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి జీవన్ రావు(Jeevan Rao) సంచలన వ్యాఖ్యలు

    శనివారం 6వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన 6వ వార్డు అభ్యర్థి న్యాయవాది గోర్పాడి జీవన్ రావు(Jeevan Rao) తన సతీమణి స్వప్న తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రావు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాను చేస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలందరు తన వైపు మద్దతుగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన ఇంటి బిడ్డగా 6వ వార్డు ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సీరియల్ నెం. 3 పై కారు గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నందుకు వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
  • ప్రజలు నాకు అండగా నిలబడి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అందించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అట్టి విజయాన్ని అందించిన ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కోన్నారు. అంతే కాకుండా ఎన్నికల సందర్భంలో తాను నమ్మకంగా పనిచేస్తానని ఏదైతే ప్రజలకు ఇచ్చినటు వంటి హామి ఉందో గెలిచిన నాటి నుండి ఏడాది లోగా ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయలేకపోతే, ప్రజా సమస్యలను పరిష్కార దిశగా పనిచేయకుంటే, 6వ వార్డు ప్రజల కోరిక మేరకు నా కౌన్సిల్ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా వారు హామినిచ్చారు. జీవన్ రావ్ సంచలన వ్యాఖ్యలతో 6వ వార్డు ప్రజలందరు పట్టం కట్టాలని ఓ నిర్ణయానికి రావడం జరిగింది. ప్రశ్నించే గొంతుక, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా, ఓ న్యాయవాదిగా ఇటువంటి వ్యక్తి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజా సమస్యలపై నిలదీస్తాడని, వాటిని పరిష్కరిస్తాడని వారిలో ఆలోచన కలిగింది. ఏది ఏమైనా జీవన్ రావు తీసుకునటు వంటి సంచలన నిర్ణయం మెదక్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.