📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sridhar Babu: ‘జై తెలంగాణ’ నినాదం ప్రజలందరి సొత్తు: మంత్రి శ్రీధర్ బాబు

Author Icon By Vanipushpa
Updated: June 2, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్, బీజేపీ(BRS, BJP) మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న తమ వాదన నిజమని కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యలతో రుజువైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయని కవిత స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో ఇదే అంశాన్ని తాము ప్రస్తావిస్తే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పెద్దఎత్తున హడావుడి చేశారని, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Sridhar Babu: ‘జై తెలంగాణ’ నినాదం ప్రజలందరి సొత్తు: మంత్రి శ్రీధర్ బాబు

కేసీఆర్ కుమార్తె స్వయంగా బయటపెట్టారు
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. “బీఆర్ఎస్, బీజేపీ కలిసి ముందుకు సాగుతున్నాయని కవిత స్పష్టంగా చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని కేసీఆర్ కుమార్తె స్వయంగా బయటపెట్టారు. దీనిపై ఆ రెండు పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు?” అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
ఒక స్వతంత్ర దర్యాప్తు

అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇది ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ అని, అటువంటి కమిషన్‌ను రాజకీయ కోణంలో విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కమిషన్ తన పని తాను చేసుకుపోతుందని, దానిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
‘జై తెలంగాణ’ నినాదం గురించి మాట్లాడుతూ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నినాదమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ హక్కులు తీసుకోలేదని, ఇది కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితమైన నినాదం కాదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదమని, దాన్ని సంకుచిత రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు.

Read Also: Elections : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం

'Jai Telangana' #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Minister Sridhar Babu Paper Telugu News slogan belongs to all people Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.