हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jaggareddy: రాహుల్ పై కేంద్రం కుట్రపూరిత విమర్శలు చేస్తుందన్న జగ్గారెడ్డి

Anusha
Jaggareddy: రాహుల్ పై కేంద్రం కుట్రపూరిత విమర్శలు చేస్తుందన్న జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై సంచలన ఆరోపణలు చేశారు.ఎందుకంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని జగ్గారెడ్డి(Jaggareddy) తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ఉందని ఆయన అన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని జగ్గారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

 Jaggareddy: రాహుల్ పై  కేంద్రం కుట్రపూరిత  విమర్శలు చేస్తుందన్న జగ్గారెడ్డి
Jaggareddy: రాహుల్ పై కేంద్రం కుట్రపూరిత విమర్శలు చేస్తుందన్న జగ్గారెడ్డి

కార్యాచరణ

బీజేపీ నాయకులకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత  ఏమాత్రం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా, అనవసర విమర్శలు చేస్తే తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “మీరు తప్పులు చేస్తూ, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుడిపై నిందలు వేయడం ఎంతటి దుర్మార్గమైన ఆలోచన, వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు” అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. 

Read Also: KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870