Inter Hall Tickets 2026: హాల్‌టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి ఇలా

Read Time:  1 min
Inter Hall Tickets 2026: హాల్‌టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి ఇలా
FONT SIZE
GET APP

Inter Hall Tickets 2026: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లలో పేరు, చిరునామా, సబ్జెక్ట్‌లు, మీడియం వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులుంటే.. కాలేజీ ప్రిన్సిపాళ్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తక్షణమే అవసరమైన మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటనలో సూచించారు.

పరీక్షలు ప్రారంభమయ్యేలోపు సవరించిన హాల్ టికెట్లను తిరిగి జారీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా, విద్యార్థులు తమ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని, ఏవైనా పొరపాట్లు గమనించినట్లయితే వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు.

Read Also: AP RTE Notification 2026: ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్

Inter Hall Tickets 2026: హాల్‌టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి ఇలా
Inter Hall Tickets 2026: If there are any errors in the hall tickets, correct them like this

మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ లింక్, క్యూఆర్ కోడ్ సౌకర్యం

అలాగే ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్‌ నంబర్లకు కూడా ఫిబ్రవరి 20 (శుక్రవారం) నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇంటర్‌ బోర్డు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపించబోతోంది. దాన్ని క్లిక్‌ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్‌ను కూడా ముద్రించామని, దానివల్ల పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించవచ్చని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,96,529 మంది హాజరుకాబోతున్నారు. ఇందుకు మొత్తం 1495 సెంటర్లు ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం ఈ ఏడాది సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.