📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Surekha: దేవుడి భూములపై కన్నేస్తే ‘పిడి’ కొరడా

Author Icon By Vanipushpa
Updated: June 13, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భూములకు ఫెన్సింగ్ వేయండి
అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రంలో దేవాదాయశాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేసేవారిపై పీడీ యాక్టులు(PC Act) పెడతామని, అసలు దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా కాకుండా చూస్తామని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పేర్కొన్నారు. దేవుడి భూములు పరిరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, తాము అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి దేవుడి భూములు కాపాడుతున్నట్టు తెలిపారు. మేడ్చల్ జిల్లా(Medchal District) మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయశాఖభూమి అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.33 ఎకరాలు, సర్వే నెంబరు 33/9లో 13 ఎకరాలు, సర్వే నెంబరు 33/10 లో 6.33 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి తదితరుల ద్వారా… సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారన్నారు. అప్పటి నుంచి ఈ భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ భూమిని కాపాడుతూ వచ్చాయని అయితే, ఈ భూములను కబ్జా చేసేందుకు కొంతమంది పని చేస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందే ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు.

దేవుడి భూములపై కన్నేస్తే ‘పిడి’ కొరడా

భూములన్నీ దేవాదాయ శాఖకు చెందిన భూములు

కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై పీడీ యాక్ట్ పెడుతామని హెచ్చరించారు.చెంగిచెర్ల భూములు, 1976లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖకు దక్కాయన్నారు. అయితే, వీటిని కొంతమంది ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేపడుతున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మార్వోతో కలసి కొంతమంది నకిలీ సర్వే చేయించి అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాజాగా ఏడీ సర్వే చేయించగా ఈ భూములన్నీ దేవాదాయ శాఖకు చెందిన భూములుగా తేలినట్టు మంత్రి సురేఖ చెప్పారు.

తని ఖీలు చేపట్టాలని ఆదేశం

ఈ కబ్జా అంశం, మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, జంగయ్య యాదవ్ లు వరంగల్ వెళ్తున్న మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కొండా సురేఖ వెనువెంటనే రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులను పిలిపించి తని ఖీలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తోనూ ఫోన్లో మాట్లాడారు. దేవాదాయ శాఖకి చెందిన ఈ 30 ఎకరాల భూములను రక్షించి బార్ కోడ్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ భూములు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి తహ సీ ల్దారు హసీనా, దేవాదాయ శాఖ సర్వేయర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: Thummalanageswar Rao: మంత్రి తుమ్మలను విచారించనున్న జస్టిస్ పిసి ఘోష్?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu If you set your eyes Latest News in Telugu on God's lands Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today you will be whipped by the 'fiscal'.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.