High Court:హైదరాబాద్లో నివసిస్తున్నవారికి హైడ్రా అంటే బాగా తెలుసు. గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాలను, నాలాలపై నిర్మిస్తున్న భారీభవనాలను కూల్చివేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదాన్ని మోపుతున్నది. అక్రమకట్టడాల వెనుక ఎంతటి బడానేతలు ఉన్నా, సెలబ్రిటీలు ఉన్నా సరే ఏమాత్రం వెనుకంజ వేయకుండా కూల్చివేస్తున్నది. దీనికారణంగా అనేకులు తమ ఇళ్లను (houses) కోల్పోతున్నారు. కొత్తగా కట్టించుకున్న ఇళ్లను సైతం ఏమాత్రం ఉపేక్షించకుండా హైడ్రా కూల్చివేస్తున్నది. దీంతో అనేకమంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు హైకోర్టు హైడ్రాపై (Hydra) తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. అయినా హైడ్రా తన తీరును మార్చుకోకపోవడం విశేషం. తాజాగా రంగారెడ్డి జిల్లా ఖానామెట్ గ్రామంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన 1.07 ఎకరాల భూమి విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకుంటుందని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ విచారిస్తూ హైడ్రాపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది.
వాహనాలకు ఆ రంగులేంటి?
ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు వాహనాలకు ఆర్మీరంగులేంటని, చెరువులకు ఎఫ్ఎఎల్ నిర్ధారించకుండా కూల్చివేతలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది కోర్టు.
ప్రభుత్వ భూముల రక్షణ పేరిట హైడ్రా ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తుందని, హడావిడి నిర్ణయాలతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతుందని హైకోర్టు జస్టిస్
బి.విజయసేనరెడ్డి నిలదీశారు.
ప్రైవేటు భూముల జోలికి ఎందుకు వెళ్తున్నారు?
ప్రైవేటు భూముల జోలికి ఎందుకు వెళ్తున్నారని, స్టే ఇవ్వని చెరువుల పరిధిలో వరదలు నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు అంటే ఏంటో తెలిసి కూడా రంగరాథ్ ఇలా ప్రవర్తించడం సరికాదని కోర్టు తీవ్రవ్యాఖ్యల్ని చేసింది. కాస్త వర్షం వస్తే చాలు రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తుంటాయి. ప్రతిసంవత్సరం వర్షాలు వస్తున్నా, రోడ్లపై వచ్చే వరదల్ని ప్రభుత్వాలు నివారించలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని హైకోర్టు హైడ్రాని ప్రశ్నించింది.
Read also:hindi.vaartha.com
Read also: