Hyderabad rainfall: నగరమంతా ‘సాగర’మే!

Read Time:  1 min
Hyderabad rainfall
Hyderabad rainfall
FONT SIZE
GET APP

హైదరాబాద్లో మళ్లీ నిండుగా కుండపోత. దాదాపు అన్ని ప్రాంతాల్లో 8 నుంచి 11 సెం.మీ వాన.

హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad)పై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం సాయంత్రం మూడు, నాలుగు గంటల పాటు క్లౌడ్ బరస్ట్ తరహాలో వర్షం కురిసింది. అత్యధికంగా మియాపూర్లో(Miyapur) 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లింగపల్లిలో 8.2 సెం.మీ. హెసియు వద్ద 8.1 సెం.మీ. గచ్చిబౌలిలో 6.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో మధ్యరాత్రి వరకు వాన పడింది. నగరంలోని చాలా రోడ్లు నదులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం(heavy rain)కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.

సాగర’మే

చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయని, ట్రాఫిక్ కు అంతరాయం ఉన్నచోట్ల వెంటనే పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. జిహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాల అధికారులు వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

Read Also:

https://vaartha.com/ap-weather-heavy-rain-alert-in-several-districts-next-24-hours/andhra-pradesh/549503/

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.