📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు

Metro Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

Author Icon By sumalatha chinthakayala
Updated: April 17, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Metro Charges : హైదరాబాదులో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్‌ షాక్‌ అని చెప్పాలి. మెట్రో ఛార్జీలు పెంపకం తథ్యమని తెలుస్తోంది. అతి త్వరలోనే మెట్రో ధరలో పెంపునకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. దాదాపు 50 శాతం పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు పెంచే యోచనలో ఉంది. అది ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీ

ఇప్పటికే మెట్రో రూ.59 హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది. రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. మెట్రో ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎల్ అండ్ టి. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు .

మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది

కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44 శాతం పెరిగాయి హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది.

మెట్రోలో మాత్రం 50% మేరకు ఛార్జీలు పెరిగే అవకాశం

2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రజలకు సేవలు అందిస్తూ వస్తుంది. అయితే రూ.6500 కోట్లకు మెట్రో రైల్ నష్టాలు చేరాయి అని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారస్థాయికి చేరడంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవడం లేదు. కొత్త వాటిని కొనుగోళ్లకు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని దానికి ఈ చార్జీలు పెంపక తప్పడం లేదు. అయితే హైదరాబాద్ మెట్రోలో మాత్రం 50% మేరకు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Read Also: నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

Breaking News in Telugu Google news Google News in Telugu Hyderabad Metro Latest News in Telugu Metro Charges Hike Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.