Telangana tourism events : హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ స్టార్ట్! హైదరాబాద్‌లో రైడ్ ధర ఎంత?

Read Time:  1 min
Telangana tourism events
Telangana tourism events
FONT SIZE
GET APP

Telangana tourism events : హైదరాబాద్ నగరంలో పర్యాటకులను ఆకట్టుకునేలా రంగురంగుల ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవం ఆదివారం వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. Golconda Fort సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ ఫెస్టివల్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి Jupally Krishna Rao ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన బెలూన్ సుమారు 13 కిలోమీటర్లు ప్రయాణించి అప్పాజీగూడ శివారులో ల్యాండ్ అయింది. ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించడం ఒక మరిచిపోలేని అనుభవమని మంత్రి తెలిపారు.

Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ ద్వారా రాష్ట్ర పర్యాటక (Telangana tourism events) శాఖ కొత్త తరహా పర్యాటక అనుభూతులను ప్రజలకు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రోన్ ఫెస్ట్, కైట్ ఫెస్ట్ లాంటి కార్యక్రమాలతో సంస్కృతి, సాంకేతికతలను మిళితం చేస్తూ తెలంగాణ పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ తరహా వేడుకలు అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించాలంటే?

పర్యాటక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. ఒక్కో రైడ్‌కు రూ.2,000గా నిర్ణయించారు. జనవరి 17, 18 తేదీల్లో వేదికలు వాతావరణాన్ని బట్టి ఖరారు చేస్తామని, శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కూడా రైడ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.