HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

Read Time:  1 min
HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు
FONT SIZE
GET APP

హైదరాబాద్‌లోని (HYD) జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. నమ్మకంగా వంటమనిషిగా చేరిన ఒక వ్యక్తి, యజమానులు లేని సమయం చూసి తోటి పనివారికి మత్తు మందు ఇచ్చి, కోటి రూపాయలకు పైగా విలువైన వజ్రాభరణాలను (Diamond jewelry) ఊడ్చుకెళ్లాడు. నందగిరి హిల్స్‌లోని వ్యాపారి రవీంద్రశర్మ నివాసంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Read Also: Telangana Govt: వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు
A cook by profession this con artist tried to swindle people out of diamonds.

మత్తు మందు ఇచ్చి చోరీ

నేపాల్‌కు చెందిన భూపేంద్రషాహీ అలియాస్‌ భువన్‌ అనే వ్యక్తి 15 రోజుల క్రితమే ఓ ఏజెంట్ ద్వారా రవీంద్రశర్మ ఇంట్లో వంటమనిషిగా చేరాడు. (HYD) గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లిన సమయాన్ని నిందితుడు తనకు అనువుగా మార్చుకున్నాడు. తన పుట్టినరోజు అంటూ వాచ్‌మన్ సహా ఇతర పనిమనుషులకు మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. వారు స్పృహ కోల్పోగానే మరో ఇద్దరు స్నేహితులను పిలిపించి, రెండో అంతస్తులోని అల్మారాలను ధ్వంసం చేసి వజ్రాలు, బంగారు నగలను దోచుకున్నాడు.

సరిగ్గా చోరీ ముగించుకుని బయటకు వస్తుండగా యజమాని కోడలు ఇంటికి చేరుకుంది. ఆమెను తోసుకుంటూ నిందితులు ముగ్గురూ బైక్‌పై పారిపోయారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాచ్‌మన్ దంపతులు తాళ్లతో బంధించబడి ఉండటం, లాకర్‌లోని నగలు మాయమవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను చేర్పించిన ఏజెంట్ మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీ వెనుక ప్రొఫెషనల్ నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.