📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rain: తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: May 20, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది.వేసవి కాలంలోనూ వర్షాకాలాన్ని తలపిస్తూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పగటిపూట ఎండలు దంచికొడుతున్నప్పటికీ, సాయంత్రం వేళల్లో ఈదురుగాలుల(Stormy winds)తో కూడిన వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బుధవారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేశారు. నేడు కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.మరోవైపు, నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Rain: తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు

స్థానికులు

సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో నిర్మల్ జిల్లా బీరెల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ విచిత్ర వాతావరణ పరిస్థితులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.ఈ అకాల వర్షాలు ఒకవైపు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చింతకాని మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగి కవికొండల శ్రీనివాస వెంకటకృష్ణారావు (57), వైరా మున్సిపాలిటీ పరిధిలో రేకుల ముత్తమ్మ (49) వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని ధర్మాపూర్ వాగు మండు వేసవిలోనే ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వానలతో వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో సాయంత్రం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Read Also : Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ

#HyderabadRains #TelanganaNews #TelanganaWeather #UnseasonalRain Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.