📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News – Harish Rao : రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజం

Author Icon By Sudheer
Updated: September 15, 2025 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు కోల్పోకుండా పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao)ను కలిసి కోరారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు, రైతుల పక్షాన తాను బలంగా నిలుస్తానని, భూములు కోల్పోకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

ట్రిపుల్ ఆర్ (RRR) పేరిట ఇష్టారీతిగా అలైన్‌మెంట్ మార్చి పేద రైతుల పొలాలను బలి చేస్తున్నారని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ నాయకుల భూములకు ఏమాత్రం నష్టం జరగకుండా, రైతుల పచ్చని పొలాలు మాత్రమే కోల్పోవడం సిగ్గుచేటు అన్నారు. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాలు కోల్పోతున్న రైతులు నిరసనలతో రోడ్లపైకి రావడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూపిస్తోందని ఆయన తెలిపారు.

హామీలు నిలబెట్టకపోతే తీవ్ర పోరాటం

ఎన్నికల ముందు రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు, జాతీయ నాయకులు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నిర్బంధాల మధ్య భూసేకరణ చేస్తుండడం కర్కశమని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే అలైన్‌మెంట్ మార్పులు జరగడం వల్ల కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును తిరస్కరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టే చర్యలు కొనసాగితే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, సమగ్ర విచారణ తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

https://vaartha.com/og-movie-guns-and-roses-song-released-from-ozzy/business/547908/

cm revanth Google News in Telugu RRR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.