Harish Rao: KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడింది

Read Time:  1 min
Harish Rao
Harish Rao
FONT SIZE
GET APP

KCR నిర్వహించిన ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రాత్రి 9:30 గంటలకే సీఎం చిట్‌చాట్ పెట్టడం, మంత్రులు వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహించడమే KCR రాజకీయ ప్రభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

Harish Rao
Harish Rao

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సీఎం రేవంత్‌లో ఓటమి భయాన్ని పెంచాయని హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. అందుకే కో-ఆపరేటివ్ ఎన్నికలను ప్రభుత్వం కావాలనే వాయిదా వేస్తోందని అన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను, అవకతవకలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి సుమారు రూ.7,000 కోట్లను పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం రాజకీయ ఎజెండాతోనే ముందుకెళ్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.