📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Handloom Workers: నేతన్నలకు రూ.లక్షలోపు రుణమాఫీ

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఎం రేవంత్​ రెడ్డి  చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గడిచిన సెప్టెంబరులో ప్రకటించారు. తాజాగా వీటికి సంబంధించి జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 2017 ఏప్రిల్​ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు(Handloom Workers) తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో వృత్తి అవసరాల కోసం రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఊరట కలగనుంది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష లోపు రుణాలు మాఫీ కానున్నాయి. మాఫీ కాక, కొత్త రుణాలు అందక కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నామని, మార్గదర్శకాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు మాఫీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కార్మికులు కోరుతున్నారు. ఈ రుణాలు మాఫీ చేయడం వల్ల తమకెంతో లబ్ధి చేకూరతుందని అంటున్నారు.

కార్మికుడికి

వీవర్‌ క్రెడిట్‌ కార్డు, ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన, వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి.జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు ఆరుగురితో కూడిన డీఎల్‌సీ (జిల్లా స్థాయి కమిటీ) ఆమోదం పొందాలి. అనంతరం చేనేత డైరెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న స్టేట్‌ లెవల్‌ కమిటీ(State Level Committee) ఆమోదం పొందితే బ్యాంక్​ నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది.ప్రతి కార్మికుడికి సంబంధించిన రూ.లక్షలోపు రుణాలు (వడ్డీతో కలిపి) మాఫీ అవుతాయి. రూ.లక్ష ఆ పైన ఉన్న కార్మికులు, ఎక్కువ ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వారికి రూ.లక్ష మాఫీ కానుంది.ప్రభుత్వం ప్రకటించిన సమయంలో తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి సైతం వారి వ్యక్తిగత ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తారు.

Handloom Workers: నేతన్నలకు రూ.లక్షలోపు రుణమాఫీ

ప్రకారం

రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయని మహబూబ్​నగర్​(Mahabubnagar) చేనేత ఏజీ బాబు తెలిపారు. వాటిలో ఉన్న నిబంధనల ప్రకారం కార్మికులకు(workers) మాఫీ వర్తింపజేస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.

Read Also: Telangana: బోగస్ కార్డులపై ప్రభుత్వం ఫోకస్

#GovernmentSupport #LabourWelfare #LoanWaiver #TelanganaGovernment #WorkerLoanRelief Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.