📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Green Field: తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే..ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో రహదారి విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. ఎనిమిదేళ్లుగా వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్ననిజామాబాద్‌- జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి (NH-63) విస్తరణ పనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు లభించాయి.దీంతో ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లగా త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ జాతీయ రహదారి(National Highway)ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇది ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల మీదుగా మంచిర్యాల వద్దనున్న క్యాతన్‌పల్లి వరకు కొనసాగుతుంది.2016లో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన ప్రాజెక్టు కింద గ్రీన్‌ ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రాయపట్నం గోదావరి వంతెనకు సమాంతరంగా కొత్తపల్లి వద్ద మరో నూతన వారధిని నిర్మించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (NHAI) జనావాసాలకు దూరంగా కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల గుండా సాధ్యమైనంత తక్కువ భూసేకరణతో ఈ విస్తరణ పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. గత ఏడాది అక్టోబరులో NHAI శాటిలైట్ సర్వే నిర్వహించింది. అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు రైతులతో సమావేశమై భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు.

వ్యవసాయ

జిల్లాలో 30 గ్రామాల్లోని 240 మంది రైతుల నుంచి సుమారు 250 హెక్టార్ల భూమిని సేకరించారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌(Bandalingapur) నుంచి వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లి వరకు భూసేకరణ దాదాపు పూర్తయింది.ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో నష్ట పరిహారం జమ కానుంది. గత నెలలో ధర్మపురి మండలం(Dharmapuri Mandal)లో కొందరు రైతులు తమ వ్యవసాయ బావులు నమోదు కాలేదని కలెక్టరుకు ఫిర్యాదు చేయగా రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి వాటిని నమోదు చేశారు.

Green Field: తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే..ఎక్కడంటే?

రహదారి

ఈ రహదారి నిర్మాణం పట్టణాలను తాకకుండా బైపాస్‌లతోనే ముందుకు సాగనుంది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు జగిత్యాల(Jagityala) మీదుగా నిర్మించే ఈ రహదారికి కేంద్రం రూ.2,529 కోట్లు కేటాయించింది. మొత్తం 125 కి.మీ పొడవునా గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డును నిర్మించనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు (NHAI) ఏర్పాట్లు చేస్తోంది. ఈ రహదారి పూర్తయితే నిజామాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది, ఇది ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also: Miss World 2025: నేడు మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్..సందడి చేయనున్న బాలీవుడ్ తారలు

#HighwayUpgrade #InfrastructureBoost #NH63Expansion #TelanganaDevelopment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.