MLA Raja Singh Arrested: మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్

Read Time:  1 min
MLA Raja Singh Arrested: మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
FONT SIZE
GET APP

MLA Raja Singh Arrested: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్తున్న క్రమంలో, 161వ జాతీయ రహదారిపై పెద్ద శంకరంపేట సమీపంలోని ‘కింగ్స్ 9’ రెస్టారెంట్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

Read Also: Hyderabad-Goa Greenfield Highway : హైదరాబాద్-గోవా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక అప్డేట్

ముందస్తు అరెస్ట్ – స్టేషన్‌కు తరలింపు

మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్యలు భారీ బందోబస్తుతో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడలో నిర్వహించతలపెట్టిన ఒక నిరసన కార్యక్రమానికి రాజా సింగ్ వెళ్తుండగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ ముందస్తు అరెస్ట్ చేపట్టినట్లు సమాచారం. అనంతరం ఆయనను పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

MLA Raja Singh Arrested
MLA Raja Singh arrested in Medak district

తీవ్ర ఉత్కంఠ

ఎమ్మెల్యే అరెస్ట్ వార్త తెలియడంతో జాతీయ రహదారిపై స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.