తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్లీ రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ పనులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయత్రి ఇథనాల్ కంపెనీ(Gayatri Ethanol Company)కి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు.
కంపెనీకి చెందిన
కంపెనీ నిర్మాణ పనులు చేయిస్తున్న కూలీలను రైతులు తరిమికొట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేపట్టనున్నారన్న, సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలం వద్ద మోహరించినా రైతులు భారీ సంఖ్యలో ఉండడంతో వారిని పోలీసులు అదుపుచేయలేకపోయారు.కంపెనీకి చెందిన స్థలంలో ఉన్న వాహనాలను సైతం రైతులు ధ్వంసం చేశారు.పది గ్రామాల రైతుల ఆందోళన చేపట్టారు.
కంపెనీ పనుల
పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ మళ్లీ ప్రారంభించింది.దాంతో మరోసారి రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ వ్యతిరేక పోరుబాట పట్టడంతో మళ్లీ పెద్దధన్వాడ(Peddahdhanvada)లో ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ పనుల నేపథ్యంలో గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోరాట కమిటీ సైతం సూచించింది. ఈ క్రమంలో మంగళవారం కీలక ప్రకటన సైతం విడుదల చేసింది. అర్ధరాత్రి ప్రజలంతా నిద్రలో ఉండగా ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కంటైనర్లు, టిప్పర్లు, హిటాచీలను ప్రైవేటు సైన్యంతో పెద్దధన్వాడలోని నిర్మాణ స్థలంలోకి తీసుకువచ్చినట్లు కమిటీ పేర్కొంది.గత ఆరునెలలుగా 12 గ్రామాల ప్రజలైన, క్యాన్సర్ కారకాలు, విషాన్ని చిమ్మే ఫ్యాక్టరీని నిర్మించొద్దంటూ నిరసన నిరహార దీక్షలు కొనసాగించినట్లు పేర్కొంది.