📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Fly Over: హెచ్ సిటీలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ  సర్కార్ హైదరబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటుగా ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. నగరవాసులను బాగా ఇబ్బందిపెట్టేది ట్రాఫిక్ సమస్య. దీని పరిష్కారం కోసం ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడమే కాక శరవేగంగా వాటిని పూర్తి చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా త్వరలోనే కొండాపూర్ ఫ్లై ఓవర్(Kondapur Flyover) అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా జీహెచ్ఎంసీ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్‌ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాక ప్రయాణ సమయం ఆదా చేయడం కోసం మరో భారీ ఫ్లై ఓవర్(Fly Over) నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తుంది. సుమారు 150 కోట్ల రూపాయల ఖర్చుతో మూడు లేన్లలో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని భావిస్తుంది. అలానే ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ మీదుగా వచ్చే వాహనాలు నానక్ రాంగూడ, లింగంపల్లి వైపు సులభంగా వెళ్లవచ్చు. ముఖ్యంగా డీఎల్ఎఫ్(DLF) వైపు వెళ్లవారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

Fly Over: హెచ్ సిటీలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

అధికారులు

ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై స్టడీ చేసేందుకు చెన్నై(Chennai)కి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే వీరు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. దీని ఆధారంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. జూన్ నెలలో దీని పనులు ప్రారంభం కానున్నాయి అంటున్నారు.హెచ్ సిటీపై ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగానే రూ. 7,032 కోట్ల వ్యయంతో 58 పనులు ప్రారంభించింది. దీనిలో 28 ఫ్లైఓవర్ల నిర్మాణం, 13 అండర్ పాస్‌లు, నాలుగు రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, 3 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 10 రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనుల రెడీ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో కొన్నిటెండర్ల దశలో ఉండగా మరికొన్నింటికి టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ స్టేజీలో ఉన్నాయి. త్వరలోనే మొదలు పెట్టబోయే రాడిసన్ బ్లూ హోటల్(Blue Hotel) నుంచి డీఎల్ఎఫ్ వరకు నిర్మించబోయే ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా హెచ్‌సిటిలో భాగమే.

Read Also: Miss World 2025 : విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?

#FlyoverConstruction #GHMCProjects #HyderabadDevelopment #HyderabadTraffic Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.