📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ లో కొట్లాట..?

Author Icon By Sudheer
Updated: June 21, 2025 • 8:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Jubilee Hills MLA Maganti Gopinath) అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరగబోయే ఉపఎన్నికల్లో (BY Polls) కాంగ్రెస్ పార్టీ లోపలే తీవ్ర టిక్కెట్ పోటీ మొదలైంది. ఇప్పటికే అరడజనుకుపైగా కాంగ్రెస్ నేతలు టిక్కెట్ కోసం తెరపైకి వచ్చారు. మాజీ ఎంపీ అజారుద్దీన్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి, నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మైనార్టీ నేత వహీం కురేషీ ఇలా ఎంతోమంది నేతలు తమకు టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారంటే ఈ టిక్కెట్ కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.

ఎంఐఎం హెచ్చరికతో మైనార్టీ అభ్యర్థులకు చెక్?

ఈ టిక్కెట్ పోటీకి మజా ఏమంటే, ఎంఐఎం పార్టీ తాజాగా సంచలన హెచ్చరిక చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్థిని నిలబెడితే, తామూ బరిలోకి దిగుతామని హెచ్చరించింది. ఈ హెచ్చరికతో కాంగ్రెస్ లోని మైనార్టీ అభ్యర్థులు ఊహించని షాక్‌కు గురయ్యారు. ఇది మైనార్టీ ఓట్ల చీలికకు దారి తీయవచ్చన్న ఆందోళనతో, పార్టీ అధిష్టానం మైనార్టీయేతర అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటర్ల గణాంకాల మధ్య వ్యూహాలు వేస్తున్న కాంగ్రెస్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.75 లక్షల ఓట్లు ఉండగా, అందులో 1.25 లక్షలపైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ వల్ల ఓట్ల చీలిక జరగకుండా చూసేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. మైనార్టీయేతర సామాజిక వర్గాల నుంచి అజారుద్దీన్, విజయారెడ్డి, రామ్మోహన్ లాంటి నేతలకు అవకాశాలు ఇవ్వాలని పరిశీలిస్తోంది. ఒకవైపు పార్టీ లోపల గొడవలు, మరోవైపు బయట నుంచి రాజకీయ ఒత్తిళ్లతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు అసలైన సవాలుగా మారింది.

Read Also : BRS : బిఆర్ఎస్ హయాంలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టింది – మంత్రి పొంగులేటి

Google News in Telugu Jubilee Hills Jubilee Hills By-Elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.