📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: దిగుబడి పెరగడానికి వ్యవసాయ అధికారులు రైతులకు సూచన

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ భూమిలో ఏ పంటలు బాగా పండుతాయి, భూమిలో ఉన్న పోషకాల స్థాయి (భూసారం) ఎంత అనే విషయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు తరచుగా నష్టాలను చవిచూస్తున్నారు. ఒకే పంటను పదేపదే వేయడం వల్ల భూమిలో ఒకే రకమైన పోషకాలు లోపించి, పంట తెగుళ్ళు, చీడపీడలకు నిలయంగా మారుతుంది.భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి, క్రమంగా భూసారం క్షీణిస్తుంది. ఇది తక్కువ దిగుబడులకు దారితీస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ పొలాల భూసార పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల, భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలియక తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎక్కువై, లాభం తక్కువగా లేదా నష్టాలు వస్తున్నాయి.

వివరాలు

రాబోయే వానాకాలం సీజన్‌కు ముందు రైతులు తమ భూములకు భూసార, నీటి పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. దీని వల్ల భూమిలో ఉన్న పోషకాలను తెలుసుకుని, తదనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవచ్చునని అంటున్నారు. భూసార పరీక్షల వల్ల భూమిలో సూక్ష్మ, స్థూల పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుందని ఉదజని సూచిక (pH), లవణ సూచిక (EC), నేల స్వభావం, సేంద్రీయ కర్బనం (Organic Carbon) వంటి వివరాలు తెలుసుకుని అవసరమైన మార్పులు చేసుకోవచ్చునని అంటున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి స్థూల పోషకాల స్థాయి తెలుసుకుని, అవసరమైన స్థాయిలో రసాయన ఎరువులను వినియోగించవచ్చునని అంటున్నారు.

Telangana: దిగుబడి పెరగడానికి వ్యవసాయ అధికారులు రైతులకు సూచన

అధికారులు

ప్రతి మూడేళ్లకు ఒకసారి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యవసాయాధికారుల సూచనల మేరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువుల(organic fertilizers) వాడకాన్ని పెంచాలని అంటున్నారు. జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను పండించడం ద్వారా కూడా నేలను సారవంతంగా మార్చుకోవచ్చునని ఈ పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం అని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.

Read Also: Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే?

#CropRotation #SoilFertility #SoilHealth #SustainableFarming Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.