హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు(election) సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం షెడ్యూల్(Schedule) ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు గాను ₹350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, ఇప్పటికే ₹3.08 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 1,67,03,163 మంది గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
Read Also: ఆసియా కప్ 2025 ఫైనల్- పాకిస్తాన్‌పై భారత్ విజయం – ప్రధాని మోదీ స్పందన

ఎన్నికల విధానం, ఖాళీలు
రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు 3 దశల్లో, ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం), జెడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం)(Constituency) ఎన్నికలు 2 దశల్లో నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది.
- ప్రత్యక్ష ఎన్నికలు: 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు.
- పరోక్ష ఎన్నికలు: 565 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), 31 జెడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాలు.
- పార్టీల భాగస్వామ్యం: గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులపై పాల్గొంటాయి.
పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో 8,123 సమస్యాత్మక, 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1,12,720 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 43 వేలకు పైగా కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు.
- సిబ్బంది: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 651 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), 1,98,258 మంది ఇతర సిబ్బంది పాల్గొంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 4,956 మంది ఆర్వోలు, 1,82,781 మంది ఇతర సిబ్బంది పాల్గొంటారు.
- ఓటర్లు: గ్రామీణ ఓటర్లలో పురుషులు 85,36,770, మహిళలు 81,65,894, ఇతరులు 504 మంది ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఖరారు కానుంది?
సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి?
గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో, ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: