📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Etela Rajender: కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఏం చెప్పారంటే?

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేగా ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో, జ్యుడీషియల్ కమిషన్ విచారణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌(Etela Rajender)ను శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్(Judicial Commission) విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వద్దే ఉండేదని, ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా పాత్ర లేదని స్పష్టం చేశారు.

నీటి లభ్యత

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల, తన శాఖ పాత్రపై స్పష్టత ఇచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు” అని ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ(KCR Cabinet Sub-Committee)ని ఏర్పాటు చేశారని, దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారని, అయితే ఆనకట్టల నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, దానిపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Etela Rajender

ప్రతిపాదన చేశారు

మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.63 వేల కోట్లతో ప్రతిపాదన చేశారు.తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం రూ.82 వేల కోట్లకు పెరిగింది” అని ఈటల వివరించారు. కమిషన్ తనను ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందని, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని ప్రశ్నించిందని తెలిపారు. దీనికి ఆర్థిక శాఖ(Department of Finance)కు ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయమని తాను కమిషన్‌కు స్పష్టం చేసినట్లు చెప్పారు.

Read Also: MBBS Student: వియత్నాంలో తెలంగాణ మెడికో దుర్మరణం

#BRSGovernment #EtelaRajender #JudicialCommission #KaleshwaramInquiry #KaleshwaramProject Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.