📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Electric Buses: తెలంగాణకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు

Author Icon By Anusha
Updated: May 25, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ, ఇంధన వ్యయాన్ని తగ్గించడానికి  ఆర్టీసీ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది.ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన మంత్రి ఈ-డ్రైవ్’ పథకం కింద రాష్ట్రానికి కొత్త బస్సులు మంజూరయ్యాయి. గతేడాది 2,800 బస్సుల కోసం ఆర్టీసీ కేంద్రానికి దరఖాస్తు చేయగా ఈ నెల 22న 2,000 బస్సులను మంజూరు చేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ త్వరలో బస్సుల సరఫరాకు టెండర్లు పిలవనుంది. టెండర్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థ ‘వెట్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC)’ విధానంలో బస్సుల తయారీ, డ్రైవర్, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. దీనికి ఆర్టీసీ కిలోమీటర్ల వారీగా అద్దె చెల్లించాలి. ప్రస్తుతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు కి.మీ.కి రూ.57 చొప్పున చెల్లిస్తోంది.అయితే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై కార్మిక సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ అద్దె బస్సులకు సైతం ఆర్టీసీ డ్రైవర్లే(RTC Drivers) ఉండాలని అధికారులు ‘డ్రై జీసీసీ’ విధానాన్ని ప్రతిపాదించారు. కేంద్రం మాత్రం ఈ విధానం ఇప్పుడు కుదరదని, ప్రైవేటు డ్రైవర్లే ఉంటారని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా వచ్చాక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కేంద్రం

పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజిన్ అమర్చే రెట్రోఫిటింగ్ ప్రతిపాదనను ఆర్టీసీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి ఒక్కో బస్సుకు రూ.50- 60 లక్షలు ఖర్చవుతుంది. అయితే, ఈ తరహాకు సబ్సిడీ ఇచ్చే విధానం ప్రస్తుతం తమ వద్ద అమలులో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకునే బదులు ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ టెండర్ ద్వారా కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేస్తే తయారీ సంస్థలు సకాలంలో సరఫరా చేయలేవని కేంద్రం ఆర్డర్ ఇచ్చిన 14 వేల బస్సుల తయారీకే ప్రాధాన్యమిస్తాయనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో ఉంది.

Electric Buses: తెలంగాణకు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు

అదనపు

తెలంగాణకు అదనంగా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy)ని కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన సందర్భంగా హైదరాబాద్‌ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హైబ్రిడ్ జీసీసీ మోడల్ (ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లతో నిర్వహణ)ను పరిశీలించాలని, ప్రస్తుతం డీజిల్ బస్సులకు రెట్రోఫిట్మెంట్ అవకాశం కల్పించాలని సీఎం కోరారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఒక డీజిల్ బస్సుకు రెట్రోఫిటింగ్ చేసి విజయవంతంగా నడుపుతోంది.

Read Also : TG ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

#ElectricBuses #GCCModel #PMEDrive #PrivateDrivers #TelanganaBuses Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.