Election: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వేలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లో స్పష్టత లేకపోవడం ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించిందని అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ హామీలను ప్రస్తావించకపోవడం తప్పేనని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకాన్ని మాత్రమే చూపించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
Read also: Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు రద్దు ప్రారంభం లబ్ధిదారులకు కీలక హెచ్చరిక..
Election: సర్వేల్లో గెలుపెవరిదో తేలడం లేదన్న కిషన్ రెడ్డి
కాంగ్రెస్‌పై వ్యతిరేకత,
Election: అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ భాగం కేంద్రానిదేనని, దాన్ని ఆపేస్తామని చెప్పడం బాధ్యతారాహిత్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు గతంలో పాలించిన బీఆర్ఎస్ కూడా కారణమని అన్నారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి కనీస అభివృద్ధి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్‌పై నమ్మకం లేకపోవడం వల్ల ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని ఆయన విశ్లేషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: