📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Election Commission: రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana)లో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ(EC)) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు(show cause notice) జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించి చర్యలు ప్రారంభించింది.

Election Commission: రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్

ఈ విషయంపై దినపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత, వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

నోటీసులు అందుకున్న పార్టీల వివరాలు

  1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ (హన్మకొండ)
  2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ (హైదరాబాద్)
  3. జాగో పార్టీ (హైదరాబాద్)
  4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (హైదరాబాద్)
  5. తెలంగాణ లోక్ సత్తా పార్టీ (హైదరాబాద్)
  6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం (హైదరాబాద్)
  7. యువ పార్టీ (హైదరాబాద్)
  8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) (మేడ్చల్ మల్కాజిగిరి)
  9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ (మేడ్చల్ మల్కాజిగిరి)
  10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ (రంగారెడ్డి)
  11. జాతీయ మహిళా పార్టీ (రంగారెడ్డి)
  12. యువ తెలంగాణ పార్టీ (రంగారెడ్డి).
  13. 13. తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) (వరంగల్)

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: ఫోకస్‌ వల్లే రికార్డు ఇన్నింగ్స్ సాధ్యమైంది: గిల్

#telugu News 13 political parties EC action Ap News in Telugu Breaking News in Telugu EC notice 2025 EC notice to parties EC party recognition cancelled EC strict action Election Commission action Election Commission latest news Election Commission shock Google News in Telugu Indian politics update Latest News in Telugu Paper Telugu News political parties deregistered state elections news state political parties news Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.