📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Dk Aruna: డీకే అరుణకు FCI ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలు

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లోని మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిర్వహణ, సేకరణ ప్రక్రియపై ఆమెకు ప్రత్యక్ష పర్యవేక్షణ అధికారం లభించింది. ఎఫ్‌సీఐ కన్సల్టేటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా డీకే అరుణ(Dk Aruna)కు విస్తృత అధికారాలు కల్పించారు. ఆమె తెలంగాణలోని ఏ ఎఫ్‌సీఐ గోడౌన్‌లోనైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించవచ్చు. ఆహార ధాన్యాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, అవసరమైతే చర్యలు తీసుకునే అధికారం కూడా ఆమెకు ఉంటుంది. ఇది రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

ఉత్తర్వులు

తనకు అప్పగించిన ఈ కీలక బాధ్యతలపై డీకే అరుణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ ద్వారా విషయన్ని వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా నన్ను ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ కమిటీ ద్వారా తెలంగాణ(Telangana)లో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో పరిష్కార మార్గాలు చూపడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా సేకరించడం, దాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడం వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Dk Aruna: డీకే అరుణకు FCI ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలు

ప్రాధాన్యత

డీకే అరుణకు ఈ పదవి అప్పగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బీజేపీకి మరింత పట్టును పెంచుకోవాలని భావిస్తోంది. లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన వెంటనే ఈ కీలక బాధ్యతలు లభించడం డీకే అరుణకు వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం సేకరణ, రైతుల సమస్యలపై ఆమె చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పుల నేపథ్యంలో డీకే అరుణ 2019లో హస్తాన్ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె గెలుపుతో బీజేపీకి తెలంగాణలో ఒక కీలక పార్లమెంటు స్థానం దక్కినట్లయింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో డీకే అరుణ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Read Also: NITI Aayog : నేడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్

#BJPLeader #dkaruna #FCI #FoodCorporationOfIndia #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.