📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telangana: ప్రాణహిత-గోదావరి లోయలో డైనోసార్ అవశేషాలు

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 23 కోట్ల సంవత్సరాల క్రితం తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాటి డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి.దీనితో తెలంగాణ చరిత్ర మరో ప్రాచీన యుగానికి చెందినదని వెల్లడైంది.ప్రాణహిత-గోదావరి లోయలోని అన్నారం గ్రామంలో 1980లలో బయటపడిన ఈ రాక్షసబల్లి అవశేషాలు ట్రయాసిక్ యుగానికి(Triassic period) చెందిన హేరెరాసారియా జాతికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.మాంసాహారి అయిన ఈ డైనోసార్ దక్షిణ అమెరికా వెలుపల కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ డైనోసార్‌కు ‘మలేరిరాప్టర్ కుట్టి’ అని పేరు పెట్టారు. మలేరి ఘాట్ల వద్ద ఈ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును, కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి పేరును కలిపి ఈ పేరు పెట్టారు.చరిత్రకారుల ప్రకారం రాతి యుగానికి ముందు మంచు యుగం, ఆ తర్వాత ఉష్ణయుగం ఉన్నాయి. ట్రయాసిక్ యుగంలో వేడి వాతావరణం కూడా ఉండేదని,అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు(Dinosaurs) ఎలా అభివృద్ధి చెందాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణలో లభించిన ఈ డైనోసార్ అవశేషాలు ఈ పరిశోధనలకు మరింత ఊతమిస్తాయి.

అందమైన ప్రాణహిత గోదావరి చూసొద్దామా..

వాతావరణ

అయితే ఈ పరిశోదనలో వెల్లడైన డైనోసార్ దాదాపు 20 అడుగుల పొడవు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ట్రయాసిక్ యుగంలో భూమిపై తిరిగిన తొలి మాంసాహారి డైనోసార్లలో ఒకటిగా తెలుపుతున్నారు. ఈ ఆవిష్కరణ తెలంగాణ చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సహాయపడనుంది.భారతదేశంలో డైనోసార్ల ఆనవాళ్ళు చాలా చోట్ల బయటపడ్డాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల్లో కూడా వీటి అవశేషాలు ఎక్కువగా దొరికాయి. మధ్యప్రదేశ్‌లోని బాగ్‌ లోయలో మొదటిసారిగా డైనోసార్ గుడ్లు కనిపించాయి. గుజరాత్‌లోని బాలాసినోర్ ప్రాంతం కూడా డైనోసార్ల శిలాజాలకు ప్రసిద్ధి. తెలంగాణలో ఇంతకు ముందు కూడా డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి.ఆదిలాబాద్ జిల్లాలో జురాసిక్ కాలానికి(Jurassic period) చెందిన సారోపాడ్ జాతి డైనోసార్ ఎముకలు లభించాయి. అయితే తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొరికిన మలేరిరాప్టర్ కుట్టి అనే మాంసాహారి డైనోసార్ అవశేషాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ట్రయాసిక్ యుగానికి చెందినవి దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి డైనోసార్ ను కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ ఆవిష్కరణ డైనోసార్ల పరిణామ క్రమం గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

Read Also: Telangana: టిజి కు సమగ్ర శిక్షా అభియాన్ నిధులకు కేంద్రం అంగీకారం

#230MillionYearsOld #DinosaurDiscovery #MaleriRaptorKutty #TelanganaFossils Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.