DGP Shivadhar Reddy: ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు

Read Time:  1 min
DGP Shivadhar Reddy: ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
FONT SIZE
GET APP

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై విడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు, ఎన్నికలు జరిగే ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్ హెచ్)ను డిజిపి శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) కోరారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చేబట్టాలని ఆయన ఆదేశించారు. మంగళవారం నాడు జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు, ఎన్నికల ప్రాంతాలలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Read Also: Hanumakonda: కాకతీయ జూ పార్క్ లో తెల్లపులి మృతి

DGP Shivadhar Reddy: ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు
Video conference on the conduct of municipal elections.

మున్సిపాలిటీల ఎన్నికల భద్రతా ఏర్పాట్లు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (DGP Shivadhar Reddy) రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల లో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించడంతో పాటు దీనిపై తగిన సూచనలను చేశారు. 13వ తేదీన కౌంటింగ్ వుంటుందని దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సవ్యంగా వుండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ఎక్కడా చెడ్డపేరు రావద్దని ఆయన కోరారు. ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని, ఓటర్ల నుంచి, ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. నిబంధనల ప్రకారం పోలీసు లు ఎన్నికల విధులను కఠినంగా నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.

మద్యం పంపిణీ జరగకుండా చూడాలని హెచ్చరిక

హైదరాబాద్(Hyderabad) పోలీసు లీగల్ అడ్వయిజర్ శ్రీరాములు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలు ఎలా వుంటాయో వివరించారు. ఎన్నికల్లో ఎవరూ ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని, ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఓటర్లను ఎన్నికల సందర్భంగా సామాజిక బహిష్కరణ, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలపి ఆయన కోరారు.

ఎక్కడా మద్యం పంపిణీ జరగకుండా చూడాలని, లైసెన్స్ కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగానే వెల్లడించాలని, వీటిని ఉల్లంఘించే పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ఎలాంటి సమావేశాలను నిర్వహిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పాల్గొనే వారు వాహనాలను ఎంతమేరకు వినియోగించాలనే దానిపై చట్టంలో స్పష్టంగా వుందని, దీనిని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని ఆయన తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.