📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Roads: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 13వేల కి.మీ రహదారుల అభివృద్ధి

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్ర రహదారుల నిర్మాణంలో హైబ్రీడ్ యాన్యూటి మోడల్ అమలు చేస్తూ నూతన శకానికి ప్రజా ప్రభుత్వం నాంది. – పలికిందని ముఖ్యమంత్రి కార్యాలయం(CM Office) ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని – మొత్తం 28 వేల కిలోమీటర్ల రహదారులను దశలవారీగా – హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర క్యాబినెట్(State Cabinet) ఆమోదం తెలిపింది. తొలిదశలో – ఆర్ అండ్ బి పరిధిలో 7,947 కి.మి. పిఆర్ పరిధిలో 5,190కి.మీ నిడివి కలిగిన రోడ్లను హెచ్ఎఎం విధానంలో అభివృద్ధి విస్తరణ చేపట్టాలని నిర్ధారించారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే జరుగుతోంది. రహదారుల నిర్మాణంలో పెరిగిన వ్యయాలు, మారిన సాంకేతికత, ప్రభుత్వానికి ఉన్న ఇతర పనుల నేపథ్యంలో రహదారుల నిర్మాణంలో వివిధ నూతన పద్ధతులు వచ్చాయి. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా రోడ్ల అభివృద్ధి కోసం ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఐపిసి), బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్(బిఒటి), హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ వంటి విధానాలు ఆచరణలోకి వచ్చాయి. ఇపిసి విధానంలో ప్రైవేటు సంస్థలు, కాంట్రాక్టర్లు రహదారుల డిజైన్లు, రహదారుల నిర్మాణానికి – అవసరమైన సామగ్రి సేకరణ, రహదారి నిర్మాణం – బాధ్యతలు తీసుకుంటారు. వారికి ప్రభుత్వాలు ఆ మొత్తం నిధులు చెల్లిస్తాయి. ఈ విధానంలో రహదారి నిర్వహణ, యాజమాన్యం, రహదారి నిర్మించిన సంస్థ లేదా కాంట్రాక్టర్ కు బాధ్యతలు ఉండవు. బిఒటి విధానంలో రహదారి నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లు తమ నిధులతో చేస్తారు. తర్వాత దాని నిర్వహణను మెయింటెనెన్స్ వారే చూస్తారు.

Roads: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో 13వేల కి.మీ రహదారుల అభివృద్ధి

ఇపిసి, బిఒటిల కలయికతో ఏర్పడింది
రహదారి నిర్మాణానికి అయిన వ్యయాన్ని టోల్ గేట్ల ద్వారా వసూలు చేసుకుంటారు. తాము చేసిన వ్యయం రాబట్టుకున్న తర్వాత ఆ రహదారిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. హైబ్రిడ్ యాన్యూటి మోడల్ అంటు ఇటీవల బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన కాంట్రాక్టు విధానం. ఇపిసి, బిఒటిల కలయికతో ఏర్పడింది. ఈ విధానంలో రహదారి డిజైన్లు, మార్గంలో వాహనాల రాకపోకలు, ఏరకమైన నాణ్యతాప్రమాణాలతో ఆయా రహదారులు నిర్మించాలి. కల్వర్టులు, ఫ్లైఓవర్లు తదితరాల నిర్మాణాలపై ప్రైవేటు సంస్థలు లేదా కాంట్రాక్టర్లు పూర్తిగా తమ సొంత నిధులతో డీపీఆర్లు రూపొందిస్తారు. ఆ డిపిఆర్ లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది. హెచ్ ఎ ఎం విధానంలో రహదారుల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు సంస్థలు చేపడతాయి. పనులు కొంత సాగిన తర్వాత ప్రభుత్వం కొంతమేర నిధులు విడుదల చేస్తుంది. మొత్తంగా ఆ రహదారుల నిర్మాణంలో 40 శాతం నిధులను ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60 శాతం నిధులను ఆయా సంస్థలు తమ సొంత వనరులు లేదా బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొంది పనులు పూర్తి చేస్తాయి. కాంట్రాక్టు సంస్థలు వ్యయం చేసిన 60 శాతం నిధులను 10 నుంచి 15 ఏళ్లలో ఏటా కొంత మొత్తం చొప్పున వడ్డీతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది.
రహదారులపై ఎటువంటి టోల్ గేట్లు ఉండవు
ఈ కాలంలో ఆయా రహదారుల నిర్వహణ, మరమ్మతులను ఆయా సంస్థలే చేపడతాయి. ఈ రహదారులపై ఎటువంటి టోల్ గేట్లు ఉండవు. ప్రజల నుంచి ఎటువంటి టోల్ వసూలు చేయరు. ప్రభుత్వానికి ఒకేసారి భారీగా వ్యయం చేసే ఇబ్బంది తప్పడంతో పాటు ఏటా కొంత మొత్తం చెల్లింపు ద్వారా ఆర్ధిక ఉపశమనం లభిస్తుంది. తెలంగాణాలో ఆర్ అండ్ బి పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ 2 17,300 కిలోమీటర్ల రహదారులను హెచ్ఎం విధానంలో మూడేళ్లలో దశలవారీగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ ఎ ఎం తొలి విడతలోపీఆర్ వరిధిలో 7,947 కి.మీ, ఆర్ అండ్ బీ వరిధిలో 5,190 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతారు. హెచ్ఎంఎ మోడల్లో నిర్మించే రహదారుల గుర్తింపునకు అధికారులు ఒక యాప్ రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా అధికారులతో 30 సాంకేతిక, పరిపాలన నిపుణుల బృందాలను ఏర్పాటు చేశారు. ఇంజినీర్లు మూడు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. 93 రహదారులకు సంబంధించి ట్రాఫిక్ స్టడీ చేశారు. ప్రతి రహదారిపై ప్రతి 200 మీటర్లకు ఒక పాయింట్ ఏర్పాటు చేసుకొన్నారు. తొలిదశలో రహదారులపై మొత్తంగా 65 వేల పాయింట్లు గుర్తించి అక్కడ పరిస్థితులను నమోదు చేశారు. రహదారి ఎత్తు, లోతు, కల్వర్లు, అక్కడ నేల తీరుతదితర అంశాలు గుర్తించి రోడ్డు నిర్మాణంలో అనుసరించాల్సిన సాంకేతిక ప్రమాణాలకు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ట్రాఫిక్ స్టడీ అంటే ఆ రహదారిపై ఒక రోజుకు, ఒక గంటకు ఎన్ని వాహనాలు
కాంట్రాక్టు సంస్థలే భరించాలి
వెళుతున్నాయని కూడా శాస్త్రీంగా దత్తాంశంను సేకరిచారు. రోడ్డుపై వుండే లోద్భారం కూడా గణన చేసేందుకు ఎటువంటి వాహనాలు ఉన్నాయిని కూడా పరిశీలించారు. సరకు రవాణా వాహనాలు ప్రయాణికుల వాహనాల విసృతి ఆ ఆరోడ్డుపై ఎలా ఉందో కూడా పరిశీలించారు. ట్రాఫిక్ స్టడీ ఆధారంగా ఆ రహదారిని ఎంత సామర్థంతో, ఎన్ని వరుసలుగా నిర్మించాలనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హెచ్ఎం విధానంలో రహదారుల నిర్మాణంలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ గైడ్లైన్స్ తో పాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మార్గదర్శకాలను అమలు చేస్తారు. హెచ్ ఎ ఎం విధానంలో ప్రభుత్వం వెచ్చించే 40 శాతంలో యుటిలిటీస్ కరెంట్ స్తంభాలు, పైపులైన్లు, టెలిఫోన్ స్తంభాలు, తీగలు తదితరాలు తొలగింపుతో పాటు జీఎస్టీ ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. మిగతా 60 శాతాన్ని కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు సంస్థలు బ్యాంకుల నుంచి రుణంగా లేదా సొంతంగా వ్యయం చేస్తారు. హెచ్ ఎ ఎం లో రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఆమోదం పొందిన నాటి నుంచి నిర్మాణం మొదలుపెట్టే వరకు ఆ రహదారుల్లో తాత్కాలిక మరమ్మతులను సైతం ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు సంస్థలే భరించాలి. రహదారి నిర్మాణంతో పాటు ఆ తర్వాత 15 ఏళ్ల పాటు ఆ రహదారుల మెయింటెనెన్స్క బాధ్యత సైతం ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టు సంస్థలు చూసుకోవాల్సి ఉంటుంది.

Read Also: Kaleshwaram Project : కాళేశ్వరం విచారణ- కేసీఆర్ ఏం చెబుతారో?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Development of 13 Google News in Telugu Latest News in Telugu Paper Telugu News roads under hybrid annuity model Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.