Devarakadra gurukula: పాము కాటుకు గురైన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి

Follow Us: Google News Daily Hunt
The student must be provided with better medical care.
The student must be provided with better medical care.
FONT SIZE
GET APP

Devarakadra gurukula:అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్. పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోని కళాశాల యాజమాన్యం చౌదర్పల్లి గురుకుల కళాశాలలో చదువుతున్న సమయాల్లో విద్యార్థులను రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు నింపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రోడ్లపై విద్యార్థులను వదిలేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో కళాశాల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని కళాశాల పరిసరాల్లో విషపురుగులు పాములు సంచరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పాము కాటుకు గురైన విద్యార్థికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్థానిక అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వైద్యులను ఆదేశించారు.

Read also: CM Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్కూల్స్’పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Devarakadra gurukula:కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం

దేవరకద్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల (టి ఏచ్ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్/జే సి)లో పాము కాటుకు గురైన విద్యార్థి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను సమీక్షించారు.విద్యార్థి చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు అదనపు కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు