हिन्दी | Epaper

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

Anusha
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ క్లీన్‌చిట్ ఇవ్వడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని కోర్టు తీర్పుతో రుజువైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: Asaduddin: యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

కుటుంబ సభ్యులు, కార్యకర్తలకు ధన్యవాదాలు

తన కష్టకాలంలో వెన్నంటి నిలిచిన వారందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. “గత కొంతకాలంగా నేను ఎదుర్కొంటున్న ఈ న్యాయపోరాటంలో నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, నా వెంటే ఉండి ధైర్యాన్ని నింపిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని ఆమె అన్నారు. అందరి మద్దతు వల్లే ఈ ఒత్తిడిని అధిగమించగలిగానని పేర్కొన్నారు.

కేసీఆర్, బీఆర్ఎస్‌ను దెబ్బతీయడానికే కుట్ర!

ఈ కేసు కేవలం తనపై మాత్రమే కాదు, పార్టీపై జరిగిన కుట్రగా కవిత అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా టార్గెట్ చేయడానికే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆమె విమర్శించారు. దర్యాప్తు సంస్థల ద్వారా భయపెట్టాలని చూసినా, చివరకు నిజం గెలిచిందని ఆమె స్పష్టం చేశారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870