📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Kishan Reddy: ఖనిజాల ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతికత– కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతికత వినియోగించి ఖనిజాలు ఉత్పత్తి చేయబోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఈ ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పోషి స్తోందని చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ మైనింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో మంత్రి కాపర్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. అనంతరం ఉత్తమ మైన్ క్లోజర్ పద్ధతుల (Mine closure methods) ద్వారా స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్ పై ఈ సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కింద ఖనిజ ఉత్పత్తికి కోల్ ఇండియా అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్థానికుల జీవనోపాధికి ఇబ్బంది కోల్ ఇండియా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఖనిజాల తవ్వకంలో పారదర్శంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 500 మినరల్ బ్లాక్స్ కు సంబంధించిన లీజ్ రెన్యువల్ సులభతరం అవుతోందని చెప్పారు.

విజన్ డాక్యుమెంట్ దీర్ఘకాలిక వ్యూహాన్ని అందిస్తుందని

ఈ లీజ్ రెన్యూవల్స్ నిమిత్తం సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దీంతో అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోకి కూడా కోల్ ఇండియా (Coal India) ఆడుగుపెట్టిందని చెప్పారు. భారతదేశ ఇంధన పరివర్తన, మోలిక సదు పాయాల వృద్ధి, విద్యుత్ వాహనాలు, సౌరశక్తి వంటి పర్యావరణ అనుకూల సాంకేతికతలకు అవసరమైన రాగి తదితర గనులపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ముడి పదార్థాల భద్రతను నిర్ధారిస్తూ పెరుగుతున్న దేశీయ డిమాండ్ను తీర్చడానికి విజన్ డాక్యుమెంట్ దీర్ఘకాలిక వ్యూహాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, హిందాలకో ఇండస్ట్రీస్ లిమిటెడ్, కచ్ కాపర్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, ఇండో ఆసియా కాపర్ లిమిటెడ్, లోహమ్ వంటి కీలక వాటాదారులతో పాటు, ఇండియన్ ప్రైమరీ కాపర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ వంటి పరిశ్రమ సంఘాలతో విస్తృత శ్రేణి సంప్రదింపుల ద్వారా ఈ డాక్యుమెంట్ అభివృద్ధి చేయబడిందని వివరించారు.

Kishan Reddy: ఖనిజాల ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతికత– కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి

భాగస్వామ్యాల ద్వారా విదేశీ ఖనిజ ఆస్తులను

2047 నాటికి డిమాండ్ ఆరు రెట్లు పెరుగుతుందని కాపర్ విజన్ డాక్యుమెంట్ అంచనా వేస్తుండన్నారు.అలాగే 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల కరిగించే మరియు శుద్ధి చేసే సామర్ధ్యాన్ని జోడించే ప్రణాళికలకు రూపకల్పన జరుగుతోందని వివరించారు. ఇది ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా విదేశీ ఖనిజ ఆస్తులను (Foreign mineral assets) భద్రపరచడం ద్వారా ద్వితీయ శుద్ధిని పెంచడం, దేశీయ రీసైక్లింగ్ను మెరుగుపరచడం, బహిరంగ మార్కెట్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతునట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: T. Lakshminarayana: పోలవరం బనకచర్ల పథకంపై లోతైన అధ్యయనం చేయండి

#AdvancedMining #AtmanirbharBharat #CoalIndia #CopperVision #HyderabadNews #IndiaMining #KishanReddy #MineClosure #MineralBlocks #MineralProduction #MiningInnovation #MiningPolicy #MiningTransparency #ResponsibleMining #SustainableMining #WorldMiningSummit advanced mining technology Ap News in Telugu Atmanirbhar Bharat Breaking News in Telugu Coal and Mines Minister Coal India Copper Vision Document Google news Google News in Telugu hyderabad India mining sector Kishan Reddy Latest News in Telugu local livelihoods mine closure methods mineral blocks mineral lease renewal mineral production mining policy Paper Telugu News responsible mining sustainable mining Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news transparency in mining World Mining Summit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.