Ramakrishna : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ లేఖ రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షనీయం అన్నారు.

వయోపరిమితి గురించి ఆందోళన
అయితే, 2018 తదుపరి ఇప్పుడు మెగా డీఎస్సీ విడుదల చేయటంతో అభ్యర్థులు వయోపరిమితి గురించి ఆందోళన చెందుతున్నారని లేఖలు పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగార్దులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ తగు చర్యలు చేపట్టండి అంటూ డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
వ్యక్తిగత విదేశీ పర్యటన
ఇది ఇలా ఉండగా ఇవాల్టితో సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగియనుంది. తన పుట్టినరోజు నేపథ్యంలో విదేశీ పర్యటనకు తన కుటుంబంతో పాటు… వెళ్లారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
Read Also: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు