తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్, హరీష్‌రావు, ఈటల చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆనాటి సమాచారం మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారుదలశాఖ (Irrigation Department) కు కూడా లేఖ రాసింది.
అధికారులకు ఆదేశాలు
కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిన్న మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్‌కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు.ఈ కమిషన్ లేఖను సీరియస్‌గా తీసుకున్న ఆయన, అన్ని అవసరమైన సమాచారం, పత్రాలు వెంటనే కమిషన్‌కు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతకే పెద్దపీట వేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Medical Colleges : మూడేళ్లలో మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు – సీఎం రేవంత్