Charlapalli: ఆంధ్రా నుంచి చర్లపల్లి, లింగపల్లికి ప్రత్యేక రైళ్ల

Read Time:  1 min
Charlapalli: ఆంధ్రా నుంచి చర్లపల్లి, లింగపల్లికి ప్రత్యేక రైళ్ల
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి వార్త. రైల్వే ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కీలక చర్య తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌, ప్రయాణ భద్రత దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఏపీ నుంచి చర్లపల్లి, లింగంపల్లికి ప్రయాణించే వారికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.జులై 5 నుంచి 2026 మార్చి 28 వరకు కాకినాడ టౌన్‌ – చర్లపల్లి (07447) ప్రత్యేక రైలు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి (Charlapalli) కి వస్తుంది. ఈ రైలు కాకినాడలో ప్రారంభమై సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. జూలై 6 నుంచి మార్చి 29 వరకు చర్లపల్లి – కాకినాడ టౌన్‌ (07448) ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు వస్తుంది.

లింగంపల్లి రైల్వే స్టేషన్‌

జులై 2 నుంచి మార్చి 30 2026 వరకు కాకినాడ టౌన్‌ – లింగంపల్లి (07445) ప్రత్యేక రైలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10కి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.50కి లింగంపల్లి వస్తుంది. కాకినాడలో బయల్దేరే ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, చర్లపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. జులై 3 నుంచి మార్చి 31 వరకు లింగంపల్లి – కాకినాడ టౌన్‌ (Kakinada Town) (07446) ప్రత్యేక రైలు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

 Charlapalli: ఆంధ్రా నుంచి చర్లపల్లి, లింగపల్లికి ప్రత్యేక రైళ్ల
Charlapalli

మరికొన్ని రైళ్లు

చర్లపల్లి – తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే పొడిగించింది. జులై మొదటి వారం నుంచి జులై నెలాఖరు వరకు ఉంటాయి. కొన్ని ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట’ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లు (Some more trains) ‘జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట’ స్టేషన్‌లలో ఆగుతాయి అన్నారు. మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసింది దక్షిణమధ్య రైల్వే.ప్రత్యేక రైళ్లు నడిపించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మరింత అనుకూలంగా రైలు సేవలు అందించేందుకు రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. ప్రయాణికులకు ఇది నిజమైన వరం అనే చెప్పాలి.

Read Also: Krishnam Raju: కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు.. మూడు రోజుల విచారణ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.