Telugu News: KTR-కేటీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్ర. సామ

Read Time:  1 min
KTR-కేటీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్ర. సామ
KTR-కేటీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ భారీ కుట్ర. సామ
FONT SIZE
GET APP

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను(KTR) లక్ష్యంగా చేసుకుని భారీ కుట్ర జరుగుతోందంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కవితను ఏ విధంగానైతే కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు పంపించారో, అదే రీతిలో కేటీఆర్‌ను కూడా పక్కకు తప్పించేందుకు బీఆర్ఎస్‌లోని ఒక పెద్ద వ్యక్తి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుట్రకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారని ఆయన బాంబు పేల్చారు.

కేటీఆర్‌పై డ్రగ్స్ కేసు కుట్ర

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న ఓ ట్రబుల్ షూటర్, కేటీఆర్‌ను పక్కకు తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో, కేటీఆర్‌ను ఇరికించాలనే ప్లాన్ మొదలైంది” అని ఆయన ఆరోపించారు.

గతంలో హైదరాబాద్‌లో(Hyderabad) సెలబ్రిటీల డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో(Statement) కేటీఆర్ పేరును ప్రస్తావించారని, దాన్నే ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఆయనపై కుట్ర పన్నుతున్నారని రామ్మోహన్ రెడ్డి వివరించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

KTR

లోకేశ్, కేటీఆర్ భేటీపై రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు

వ్యాపార ఒప్పందాల కోసమే గతంలో కేటీఆర్, నారా లోకేశ్ రహస్యంగా భేటీ అయ్యారని తాను చెప్పిన విషయాలు నిజమయ్యాయని రామ్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు.

కేటీఆర్‌పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది ఎవరు?

టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి.

ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారని ఆయన ఆరోపించారు?

బీఆర్ఎస్‌లోని ఒక పెద్ద వ్యక్తి, బీజేపీ నేతలు ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trump-warns-netanyahu-again/international/548300/

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.