Breaking News: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ హైదరాబాద్‌లో రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ (BRS) కీలక నేతల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మోతీనగర్‌లోని నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Read also: Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత
Breaking News: జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హై టెన్షన్..
కూకట్‌పల్లిలోని బీఎస్పీ కాలనీలో
Breaking News: ఇక మరోవైపు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు జరపడంతో రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలో ఇలా తనిఖీలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: