LPG వినియోగదారులకు బిగ్ అలర్ట్

Follow Us: Google News Daily Hunt
Reduction in gas cylinder booking interval
Reduction in gas cylinder booking interval
FONT SIZE
GET APP

LPG : తెలంగాణలోని గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ఎల్పీజీ (LPG) డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కీలక సూచన చేసింది. వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా తమ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సందర్శించి లేదా డిస్ట్రిబ్యూటర్ సిబ్బంది సహాయంతో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది. గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ సీడింగ్ పూర్తి కాకపోతే భవిష్యత్తులో సబ్సిడీ జమకావడం పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Read Also : నా మాటే శాసనం అన్న మమత.. ఇప్పుడు నిస్సహాయస్థితిలో!

జూలై నుంచే నిలిచిపోయిన సొమ్ము – హెల్ప్‌లైన్ నంబర్ లభ్యం

ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయని వినియోగదారులకు గతేడాది జూలై నెల నుంచే సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో జమ కావడం నిలిచిపోయినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సబ్సిడీ పునరుద్ధరణ పొందేందుకు కేవైసీ పూర్తి చేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సూచనలు ఉన్నా లేదా ఏజెన్సీలపై ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా ‘1906’ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అర్హులకే సబ్సిడీ ఫలాలు అందేలా చూడటానికే ఈ చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు