📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Wine: రాష్ట్రంలో తగ్గనున్న బీరు, మద్యం ధరలు!

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. టిజిబిసిఎల్ నోటిఫి కేషన్ (TGBCL Notification)కు అనూహ్యంగా 92 కంపెనీలు, 604 కొత్త బ్రాండ్ల(New Brand)ను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపాయి. అందులో భారతీయ, విదేశీ బ్రాండ్లు ఉన్నాయి. ఈ పరిణామం మార్కెట్లో పోటీని పెంచుతుందని, ధరలు తగ్గవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీర్ సరఫరా సమస్యలు, యుబిఎల్ బకాయిలు వంటివి గతంలో కొరతకు దారితీశాయి. అయితే ప్రభుత్వ చర్చలతో సరఫరా తిరిగి ప్రారంభమైంది. సిఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పారదర్శకంగా విధానాలను అనుసరిస్తూ, ధరల సవరణ, నాణ్యతపై దృష్టి సారించింది. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిజిబిఎల్) నూతన మద్యం పాలసీకి ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్కు అసా ధారణ స్పందన లభించింది. ఈ పరిణామం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు, మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టిజిబిఎల్ ఆహ్వానించిన దరఖాస్తులకు అనూ హ్యమైన స్పందన లభించడం రాష్ట్ర మద్యం రంగంలో నూతన ఆధ్యాయానికి సంకేతమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి..
మొత్తం 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఉత్సాహం చూపాయి. వీటిలో 331 భారతీయ మద్యం బ్రాండ్లు కాగా, 273 విదేశీ బ్రాండ్లు ఉన్నాయి. ఈ విస్తృత శ్రేణి ఎంపికలు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. కొత్తగా 47 కంపెనీలు 386 బ్రాండ్లను ప్రతిపాదించగా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న 45 సరఫరా కంపెనీలు మరో 218 బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 51 కంపెనీలు1,031 రకాల మద్యాన్ని టిజిబిఎస్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. బీర్ సరఫరాలో గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) వంటి ప్రముఖ బీర్ తయారీ సంస్థ సరఫరాను నిలిపివేయడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది.
ప్రభుత్వం యుబిఎల్ మధ్య జరిగిన చర్చలు సఫలం
టిజిబిసిఎల్ కి యుబిఎల్ నుంచి సుమారు రూ.658 కోట్ల బకాయిలు, అలాగే మొత్తం మద్యం రంగానికి రూ.3,600 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఇటీవల ప్రభుత్వం యుబిఎల్ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కింగ్ ఫిషర్, హైనెకెన్ వంటి ప్రముఖ బ్రాండ్ల సరఫరా తిరిగి ప్రారంభమైంది. బకాయిల చెల్లింపును దశలవారీగా పరిష్కరిం చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ప్రభుత్వం నుంచి సుమారు రూ.2,400 కోట్ల బకాయిలు వారసత్వంగా వచ్చాయని అధికారులు వెల్లడించారు.

సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మద్యం మార్కెట్ను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా విస్తరించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించడంతో పాటు, దరఖాస్తులను వది రోజుల పాటు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచాలని టిజిబిఎల్ నిర్ణయించింది. ధరల సవరణపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. సంస్థల సరఫరా సామర్థం, నాణ్యతను కూడా నిశితంగా పరిశీలిస్తారు. ఈ చర్యలన్నీ మార్కెట్ స్థిరత్వానికి దోహదపడటమే వినియోగదారులకు అధిక కాకుండా, ఎంపికలను అందిస్తాయి. దీంతో ధరలుతగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Read Also: Telangana RTI : జూన్ 13 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభానికి సిద్ధం

#telugu News Ap News in Telugu Beer and liquor prices Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to be reduced in the state!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.