News telugu: Balmoor Venkat-నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం తగదు:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

హైదరబాద్: నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేయోద్దని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రతిపక్షాలను ముఖ్యంగా బిఆర్ఎస్ను వేడుకొన్నారు. సిఎల్పీ మీడియా సెంటర్లో ఆయన గురువారం మాట్లాడుతూ బిఆర్ఎస్ (BRS)సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు, ఈ విష ప్రచారంలో నిరుద్యోగులు భాగం కావొద్దు, నమ్మెద్దు అని హితవు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కాలెండర్ ప్రకారం వేయబోతున్న నోటిఫికేసన్ల కు నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని పిలపునిచ్చారు.

News telugu
News telugu

గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకుండా బిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం

గ్రూప్ 1 పరీక్షల్లో పదేళ్లలో ఎన్నో అవకతవకలు జరిగాయని గుర్తుచేశారు. మా ప్రభుత్వం అన్ని తప్పులను సరిదిద్ది గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్ష (Group 1 Exam) నిర్వహించకుండా మొదటి నుంచి బిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతో విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ తో పాటు కనీస అవగహన లేని పాడి కౌషిక్ రెడ్డి గ్రూప్ 1 పైన ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన చెందారు. గతంలో గ్రూప్ 1 పేపర్ల లీకేజీ విషయంలో కేటీఆర్ పీఎ పైన కూడా ఆరోపణలు వచ్చాయని ఆయన వివరించారు. దీనిపైన కెటిఆర్ ఏనాడు స్పందించలేదని అంగట్లో సరుకులు అమ్మినట్లుగా గ్రూప్స్ పేపర్స్ లీక్ అయ్యాయని గతంను గుర్తుచేసుకొన్నారు. అప్పుడు అరెస్టులు కూడా జరిగాయని చెప్పారు. గ్రూప్ పరీక్షల నిర్వహణలో వైఫల్యంపైన ఏనాడు కెసిఆర్ ప్రభుత్వం కనీసం క్షమాపణ చెప్పలేదని అన్నారు. మా ముఖ్యమంత్రి టిజిపిఎస్సిని ప్రక్షాళన చేశారని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో మా సిఎం ప్రయత్నం చేశారని అన్నారు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.