📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: వాహనదారులు రూల్స్ పాటించకపోతే ఆటోమేటిక్ ఫైన్

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎన్నిచర్యలు తీసుకుంటున్నా జనాల్లో పెద్దగా మార్పు రావడం లేదు. అతి వేగం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాక స్వయంగా తాము కూడా సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్(New Rule) తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఇదే గనక అమల్లోకి వస్తే ఇకపై ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా చలానా పడే అవకాశం ఉంది.తాజాగా కేంద్రం అన్నిరాష్ట్రాలకు ఓ లేఖ పంపింది. దీనిలో రోడ్డు రవాణా, భూములు, పట్టణ ప్రణాళిక, పంటల సాగు తదితర రంగాల్లో భారీ సంస్కరణలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాక ఈ సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. 2025 డిసెంబర్‌లోగా ఈ సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. సంస్కరణల అమలు కోసం ‘ముందుగా ఏ రాష్ట్రం అమలు చేస్తే దానికే ముందుగా నిధులు(ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్)’ అనే విధానంలో ప్రోత్సాహకాలను విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లేఖలో కేంద్రం ప్రధానంగా రవాణా రంగానికి సంబంధించి పలు కీలక సూచనలు చేసింది.

సంబంధించి

పాత వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్ననేపథ్యంలో దీనిపై కేంద్రం కీలక సూచనలు చేసింది. కనీసం 15 ఏళ్లు వినియోగించిన వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలను కొంటే ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రాలను గ్రూపులుగా విభజించింది.తెలంగాణ బీ గ్రూపులో ఉండగా ఆంధ్రప్రదేశ్ ‘ఏ’ గ్రూప్‌లో ఉంది. ఈ క్రమంలో పాత వాహనాలకు సంబంధించి ఏ గ్రూపులోని ఏపీ సహా 7 రాష్ట్రాలకు రూ.200 కోట్ల అందిస్తామని ప్రకటించింది. అలానే ‘బీ’ గ్రూప్‌లో ఉన్న తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు రూ.100 కోట్ల చొప్పున అందజేస్తామని తెలిపింది.

ఉల్లంఘించడం

ప్రభుత్వ వాహనాల్లో కాలం చెల్లినవాటిని తుక్కుగా మారిస్తే తొలి 500 వాహనాలకు ఒక్కోదానికి రూ.50 వేలు 501-1,000 వరకు రూ.60 వేలు ఇస్తామని దీన్ని ఇలా పెంచుతూ పోతామని వెల్లడించింది. తుక్కుగా మార్చే వాహనాల సంఖ్య 6 వేలకు మించితే ఒక్కోదానికి రూ.లక్షన్నర చొప్పున ఇస్తామని కేంద్రం ప్రకటించింది.అదే ప్రైవేటు వాహనాల విషయానికి వస్తే తొలి 500 వాహనాలకు ఒక్కోదానికి రూ.5 వేలు, 501-2,000 వాహనాల వరకు రూ.7,500 ఇలా పెంచుతూ పోయి చివరకు 5 వేల వాహనాలకు మించితే ఒక్కో దానికి రూ.20 వేల చొప్పున ఇస్తామని కేంద్రం లేఖలో చెప్పుకొచ్చింది.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఏటా దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మంది చనిపోతున్నారని కేంద్రం లేఖలో వివరించింది. వీటిని 2030 కల్లా 50 శాతానికి తగ్గించే లక్ష్యంతో రోడ్డు భద్రతకు ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(Electronic Enforcement) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కనీసం 5 లక్షలకు మించి జనాభా ఉన్న పట్టణాలను ఈ పథకానికి ఎంపిక చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

Read Also : Dk Aruna: డీకే అరుణకు FCI ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలు

#indiatransport #RoadSafety #SafeDriving #TrafficReforms Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.