📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Anjan kumar: జూబ్లీహిల్స్ టికెట్‌పై కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదం

Author Icon By Saritha
Updated: October 10, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక – కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి ఉధృతి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్(Congress)పార్టీ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్ కేటాయింపు విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అసహనం వ్యక్తం చేయడంతో, పార్టీ(Anjan kumar)నాయకత్వం తక్షణమే పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ మరియు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా అంజన్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనను సమాధానపరిచే ప్రయత్నం చేశారు.

Read also: వాలీబాల్ కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

“పార్టీకి 40 ఏళ్ల సేవ, కానీ గౌరవం లేదు” – అంజన్ కుమార్ ఆవేదన

ఈ భేటీలో అంజన్ కుమార్ యాదవ్ తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. “నాలుగు దశాబ్దాలుగా పార్టీ(Anjan kumar)కోసం పనిచేస్తున్న నాకు కనీసం సంప్రదింపులు లేకుండా అభ్యర్థిని ఖరారు చేయడం అవమానకరం” అని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మాత్రమే స్థానికత అంశం ప్రస్తావనలోకి రావడం పట్ల ప్రశ్నించారు. కామారెడ్డి, మల్కాజ్‌గిరి ఎన్నికల సమయంలో ఇది ఎందుకు పరిగణనలోకి రాలేదని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై చురకలు అంటించారు.

తాను ఎప్పటికీ పార్టీని విడిచిపెట్టలేదని, కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌ కోసం కట్టుబడి పనిచేశానని చెప్పారు. అయినా గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “వాళ్లు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే, మేము ఎక్కుకుంటూ పోతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుపడిన వ్యక్తి పేరును త్వరలో వెల్లడిస్తానని అన్నారు. నియోజకవర్గ కమిటీలో కూడా తనకు స్థానం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anjan Kumar Yadav congress party Jubilee Hills latest news Revanth Reddy Telangana news Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.