తెలంగాణ రాష్ట్ర గేయకవి, ప్రముఖ రచయిత అందెశ్రీ(Andesri Funeral) మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆయనకు నేడు ఘట్‌కేసర్ సమీపంలోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు, సాహిత్యప్రియులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.
Read Also: Andesri Funeral: అందెశ్రీకు ఘట్కేసర్లో నేడు చివరి వీడ్కోలు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ హాజరు
అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు. సీఎం రేవంత్ అందెశ్రీ పార్థివ దేహానికి పుష్పాంజలులు అర్పించి, పాడె మోసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందెశ్రీతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ‘అందెశ్రీ స్మృతి వనం’ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన సాహిత్య వారసత్వాన్ని స్మరించుకునేలా ప్రత్యేకంగా పార్క్, విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కుటుంబానికి రేవంత్ భరోసా
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), అందెశ్రీ(Andesri Funeral) కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. “అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన కవి. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అందెశ్రీ మృతి తీరని లోటుగా మారిందని సాహిత్య వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన రచనలు, పాటలు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: