📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ACB searches : కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌ ఇంటిపై ఏసీబీ దాడులు..

Author Icon By sumalatha chinthakayala
Updated: April 26, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ACB searches : తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 26న ఉదయం నుంచే ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్  ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించినట్లు అధికారులు గుర్తించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు

ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది ఎన్డీఎస్ ఏ. కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏసీబీ సోదాలు చేస్తోంది.

మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు

మేడిగడ్డ డిజైన్లకు సంబంధించి కొన్ని అనుమతులు, క్లియరెన్సులు లేవని ఎన్‎డీఎస్ఏ తేల్చింది. హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) సమర్పించలేదని పేర్కొంది. మేడిగడ్డపై సీడీవో ఇచ్చిన పలు డ్రాయింగ్‏లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, మోడల్ స్టడీస్ చేయనేలేదని, అది ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది.

Read Also: తెలంగాణలో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి!

acb raids Breaking News in Telugu ENC Hariram house Google news Google News in Telugu Kaleshwaram Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.