📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Maoists: పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

Author Icon By Anusha
Updated: April 5, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు జీవితాలకు ముగింపు పలుకుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవి ప్రాంతాల నుంచి ఒక్కసారిగా 86 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘ఆపరేషన్ చేయూత’ పేరిట మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి  సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్​క్వార్టర్​లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు.లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు, 66 మంది పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, తాజాగా 86 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా 25 వేల రూపాయల చెక్కును ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపునకు తోడు, మావోయిస్టు అగ్ర నాయకుల వేధింపులు,తట్టుకోలేక లొంగిపోయినట్లు ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలీషియా సభ్యులు ఉన్నారని తెలిపారు.కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నట్లు వెల్లడించారు.

పునరావాసం

ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష, మిగతా సభ్యులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం, సీఆర్‌ఫీఎఫ్‌ పోలీసుల చొరవ అమోఘం అని తెలిపారు.మొత్తం 86 మావోయిస్టులు మంది లొంగిపోవడం జరిగింది. సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసినందుకు పోలీసు శాఖ తరఫున వారిని ఆహ్వానిస్తున్నాం. వారు మా పోలీసు శాఖ మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన నగదును అందించడం జరిగింది. ఇంకా రావాల్సిన వారు కూడా హింసను వీడి వస్తే వారికి తప్పకుండా చేయూత అందిస్తామని తెలిపారు.

రేణుక ఎన్‌కౌంటర్‌

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఇంకా 95 మంది వివిధ క్యాడర్​లకు చెందిన మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మావోయిస్టు కీలక నేత ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన రేణుక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.మావోయిస్టుల పేరుతో అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై ఇటీవల కాలంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 

#IGChandrashekarReddy #MaoistReintegration #MaoistSurrender #OperationCheyutha Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.