📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైడ్రా మరో కీలక నిర్ణయం

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ లో హైడ్రా ప్రారంభం అయినప్పటి నుంచి అక్రమ కట్టడాల గుండెలో భయాన్ని పుట్టిస్తున్నది. మరోవైపు ఆక్రమణలపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతోంది. అయితే హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఎల్లుండి (జనవరి 6) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు ఫిర్యాదులను హైడ్రా చీఫ్ స్వీకరించనున్నారు. అలాగే వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. హైడ్రా పీఎస్ ఏర్పాటుపై రేపు (ఆదివారం) అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది.


నేరుగా ఫిర్యాదులు
హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్ర గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఇకపై హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్‌ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా సేవలను అందుబాటులో ఉంచనున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా గ్రీవెన్స్‌కు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌లో పాల్గొననున్నారు.

complaint cell Hydra hydra commissioner

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.