రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా: మల్లు భట్టి

Read Time:  1 min
bhatti
bhatti
FONT SIZE
GET APP

రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా ఇస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.2,000 కోట్లు, రైతు భరోసాకు రూ.19 వేల కోట్ల చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈ పథకాల అమలులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు.

లబ్ధిదారుల ఎంపిక, అమలుకు విధివిధానాలు లోతుగా చర్చించాకే కేబినెట్ ప్రకటన చేసినట్లు చెప్పారు. వ్యవసాయ యోగ్యత కలిగిన భూములన్నింటికి ఎకరాకు రూ.12 వేలు చెల్లిస్తామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి, సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందన్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.