ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో పదో తరగతి అర్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. పలు ప్రదేశాలలో ఈ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది.
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు ఇక ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయొచ్చు. విభాగాల వారీగా ఖాళీలు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే… ఈ ఉద్యోగాలకు కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ అభ్యర్థులకు 635 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 317 పోస్టులు, ఓబీసీ 1143, ఈడబ్ల్యూఎస్ 423, యుఆర్ 1714 చొప్పున ఉన్నాయి.
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఎస్ సి ఆర్ వర్క్ షాప్ యూనిట్లలో 4,232 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో వచ్చే జిల్లాలలో నివసించే అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ప్రాంతాలలో అప్రెంటీస్ షిప్ అర్హులైన అభ్యర్థులు జనవరి 27 2025వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. సికింద్రాబాద్, లాల్ గూడా, కాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్ట్ , కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ ,ఒంగోలు ,రాయనపాడు, రాజమండ్రి , నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్ గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్ ఖేడ్, మెట్టుగూడ తదితర ప్రాంతాలలో ఎస్సిఆర్ యూనిట్ ప్రదేశాలు ఉన్నాయి.ఆన్లైన్ విధానంలో దరఖాస్తు