📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

బఫర్ జోన్‌లో ఆక్రమణలను కూల్చిన హైడ్రా

Author Icon By Vanipushpa
Updated: December 31, 2024 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది హైదరాబాద్ లో పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనిపై హై కోర్ట్ కూడా పలు ఆంక్షలను విధించింది. తాజాగా ఈ ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన ఆక్రమణలను మంగళవారం నాడు హైడ్రా కూల్చివేసింది. నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది.

వ్యాపారుల, స్థానికుల ఆగ్రహం

అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే ఖాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేసారంటూ ఆవేదన చెందుతున్నారు.

నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాలు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈరోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది.. కూల్చివేతలు చేపట్టింది. దుకాణాల్లోని సామానులను తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Hydra khajanaguda cheruvu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.